BG 2.51:బుద్ధిమంతులైన జ్ఞానులు కర్మల వల్ల కలిగే ఫలితాలపై ఆశను వదిలివేసి, జన్మబంధాల నుండి విముక్తులై, దుఃఖరహితమైన పరమ పదాన్ని (మోక్షాన్ని) పొందుతారు.
కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః ।
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ ।। 51 ।।
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ ।। 51 ।।
కర్మ-జం — కర్మల వలన జనించే; బుద్ధి-యుక్తాః — సమత్వ బుద్ధి కలవారై; హి — ఎట్లయితే ; ఫలం — ఫలములు; త్వక్త్వా — విడిచిపెట్టి; మనీషిణః — జ్ఞానులు; జన్మ-బంధ-వినిర్ముక్తాః — జీవన్మరణ బంధముల నుండి విముక్తులై; పదం — స్థితి; గచ్ఛంతి — పొందుదురు; అనామయమ్ — దుఃఖరహితమైన.
ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కర్మఫలాల త్యాగము - మోక్షము
సమత్వ బుద్ధితో దుఃఖరహిత స్థితి
Renouncing Fruits of Action for Liberation
ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని చెప్పటం కొనసాగిస్తూ, అది వ్యక్తిని బాధా-రహిత స్థితికి చేరుస్తుందని శ్రీ కృష్ణుడు మరింత పేర్కొంటున్నాడు. జీవితంలో వైరుద్ధ్యము ఎలా ఉంటుందంటే, మనం సంతోషం కోసం ప్రయత్నిస్తాము కానీ దుఃఖమే అందుతుంది, ప్రేమ కోసం తపిస్తాము కానీ నిరాశే ఎదురవుతుంది, జీవించాలని కోరుకుంటాము కానీ మరణం వైపుగా ప్రతిక్షణం అడుగులేస్తుంటాము.
ఈ లోకంలో ప్రతి ఒక్కరూ దుఃఖితులై ఉన్నారు. కొంతమంది శారీరక, మానసిక సమస్యలతో, మరికొందరు దరిద్రంతో బాధపడుతున్నారు. కామ్య కర్మల ద్వారా ఎవరూ ఆనందాన్ని పొందలేరు అని తెలుసుకుంటే, వారు పరుగులు పెట్టే దిశ నిరర్థకమైనదని అర్థం చేసుకుని, ఆధ్యాత్మిక జీవనం వైపు తమ జీవితాన్ని యూ-టర్న్ తిప్పుకుంటారు.
ప్రజలు సుఖం కోసం పనులు చేస్తారు, కానీ దానివల్ల సుఖం లభించదు, దుఃఖం కూడా శాంతించదు. పైగా దుఃఖమే కలుగుతుంది. కాబట్టి నిజమైన శ్రేయస్సును భగవంతుడే మనకు బోధించాలి.
ఆధ్యాత్మిక జ్ఞానంలో దృఢమైన సంకల్పం కలవారు భగవంతుడే సర్వ కార్య ఫలములకు భోక్త అని తెలుసుకుంటారు. ఆ కారణంగా, వారు తమ కర్మ ఫలములపై మమకారం విడిచిపెట్టి, అంతా భగవంతునికి సమర్పించి, మరియు ప్రశాంత చిత్తంతో అన్నిటినీ ఈశ్వర ప్రసాదం (అనుగ్రహం)లా స్వీకరిస్తారు.
ఈ విధంగా కర్మఫలాసక్తిని విడిచిపెట్టి సమత్వ బుద్ధితో కర్మలను ఆచరించడం వలన, ఆ పనులు జీవుడిని జనన-మరణ చక్రంలో పడవేసే కర్మ బంధాలుగా మారవు. ఫలితంగా సమస్త దుఃఖములకు అతీతమైన మోక్ష స్థితి (అనామయం) లభిస్తుంది.