BG 2.53:వేద వాక్యాలను వినడం వల్ల చలించిన నీ బుద్ధి ఎప్పుడైతే ఆత్మ చైతన్యంలో నిశ్చలంగా, స్థిరంగా నిలుస్తుందో, అప్పుడు నువ్వు దివ్యమైన యోగస్థితిని పొందుతావు.
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా ।
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ।। 53 ।।
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ।। 53 ।।
శృతి-విప్రతిపన్నా — కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా; తే — నీ యొక్క; యదా — ఎప్పుడైతే; స్థాస్యతి — ఉండునో; నిశ్చలా — నిశ్చలంగా; సమాధౌ — భగవంతుని యందు; అచలా — స్థిరముగా; బుద్ధిః — బుద్ధి; తదా — అప్పుడు; యోగం — యోగము; అవాప్స్యసి — నీవు పొందెదవు.
ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సమాధి యందు నిశ్చల బుద్ధి
పరమాత్మతో సంపూర్ణ యోగ స్థితి
Equanimity of Mind in Samadhi
సాధకులు ఆధ్యాత్మిక పథంలో పురోగమించేటప్పుడు తమ మనస్సులో వారికి భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో, తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకంగా, సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. పూజాది కార్యాలను వదిలి పూర్తిగా సాధనలో నిమగ్నమైతే ఏదైనా తప్పు చేసినట్టవుతుందా అని సంశయ పడతారు.
కోరికలను తీర్చే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా సాధన లోనే నిమగ్నం అవటం తప్పు కాదని, పైగా అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
‘ఓ సంధ్యావందనమా, పుణ్య స్నానాలారా, పితృకర్మలారా, నాకు సెలవు ఇవ్వండి. నేను ఇప్పుడు ఎక్కడ కూర్చున్నా కంస విరోధి అయిన శ్రీ కృష్ణ పరమాత్మనే స్మరిస్తున్నాను. ఆ స్మరణే నా పాపాలను హరిస్తుంది. నాకిక ఇతర కర్మలతో పనేముంది?’
శ్రీ కృష్ణుడు 'సమాధౌ-అచలా' అన్న పదాన్ని, భగవంతుని ధ్యాసలో ఉండే దృఢ సంకల్పాన్ని సూచించటానికి ఉపయోగించాడు. 'సమాధి' అంటే 'సమ్' (సమత్వము) మరియు 'ధి' (బుద్ధి) అన్న మూలధాతువుల నుండి ఏర్పడింది, అంటే 'పరిపూర్ణ సమత్వ బుద్ధి స్థితి'.
ఉన్నతమైన చైతన్యంలో స్థిర బుద్ధి కలిగి, ప్రాపంచిక భౌతిక ప్రలోభాల పట్ల మోహితుడు కానివాడు, ఆ యొక్క 'సమాధి' అంటే సంపూర్ణ యోగ స్థితిని పొందుతాడు. అక్కడ బుద్ధికి, మనస్సుకు భగవంతునితో శాశ్వత అనుసంధానం లభిస్తుంది.