BG 2.65:ఆ పరమ ప్రశాంతత లభించినప్పుడు సమస్త దుఃఖాలు నశించిపోతాయి. ప్రశాంతమైన చిత్తము గలవాని బుద్ధి ఆతి త్వరలోనే పరమాత్మ యందు స్థిరపడుతుంది.
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ।ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ।। 65 ।।
ప్రసాదే — భగవత్ కృపతో; సర్వ — అన్నీ; దుఃఖానాం — దుఃఖములూ; హానిః — వినాశనం; అస్య — అతని; ఉపజాయతే — వచ్చును; ప్రసన్న-చేతసః — ప్రశాంత మైన చిత్తంతో; హి — నిజముగా; ఆశు — త్వరగానే; బుద్ధిః — బుద్ధి; పర్యవతిష్ఠతే — స్థిరముగా నిలుచును.
ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

భగవత్ కృపతో ప్రశాంతత
సర్వ దుఃఖ నివారణం
The Cessation of All Sorrows
కృప (అనుగ్రహం) అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లోనికి వరద లాగా వచ్చే ఒక దివ్యమైన శక్తి. తన కృప ద్వారా, సత్-చిత్-ఆనంద స్వరూపుడైన భగవంతుడు, తన దివ్య జ్ఞానాన్ని, దివ్య ప్రేమను మరియు దివ్య ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.
ఇది బుద్ధిని భగవంతుని యొక్క ప్రేమ, ఆనందం మరియు జ్ఞానంలో ఓలలాడిస్తుంది. భగవంతుని కృపచే మనం ఎప్పుడైతే ఆ దివ్య ఆనందం రుచి ఎరుగుతామో, ఇంద్రియ సుఖముల కోసం ఉన్న తపన శాంతిస్తుంది. ఎప్పుడైతే ప్రాపంచిక వస్తువుల కోసం యావ తొలగిపోతుందో, ఆ వ్యక్తి అన్నీ దుఃఖాలకు అతీతుడై, అతని మనస్సు శాంతినొందుతుంది.
ఆంతరంగిక శాంతియే మనస్సు యొక్క సహజ సిద్ధమైన దైవిక స్థితి.
ఎప్పుడైతే ప్రాపంచిక వస్తువుల కోసం యావ తొలగిపోతుందో, ఆ వ్యక్తి అన్నీ దుఃఖాలకు అతీతుడై, అతని మనస్సు శాంతినొందుతుంది. ఆ యొక్క అంతర్గత తృప్తి స్థితిలో, భగవంతుడు మాత్రమే ఆనందానికి మూలం అని బుద్ధి స్థిర నిశ్చయానికి వస్తుంది.
దీనికి పూర్వం, కేవలం శాస్త్రాల ద్వారా మాత్రమే తెలిసిన విషయం, ఇప్పుడు ఆత్మానుభూతి ద్వారా సత్యమవుతుంది. ఆ పరమ శాంతి దివ్య ఆనందాన్ని ఇస్తుంది.
ఇంద్రియ జయం ద్వారా చిత్త ప్రసాదాన్ని, తద్వారా శాశ్వత బుద్ధి స్థిరత్వాన్ని పొందవచ్చని గీతాచార్యుని హామీ.
ఇదే ఆధ్యాత్మిక సాధన యొక్క పరమావధి.