**తాత్పర్యము**: కోటి సూర్యుల తేజస్సు కలిగి, వరాహ ముఖముతో ప్రకాశించుచు, హల ముసలములచే దుష్ట శత్రువులను సంహరించు శ్రీ ఆది వారాహి దేవి నాకు విజయాన్ని ప్రసాదించుగాక.
సంగ్రామే రక్షణీ త్వం మే దుర్గే దుర్గతినాశిని |
సకలాభీష్టదే దేవి వారాహి నమోస్తు తే ॥ 3 ॥
**తాత్పర్యము**: యుద్ధమునందు, ఆపదలయందు నన్ను రక్షించుచు సకల అభీష్టములను నెరవేర్చు శ్రీ ఆది వారాహీ దేవికి నమస్కరించుచున్నాను.