ప్రధాన విషయమునకు వెళ్ళు
Home > Bhagavad Gita > అధ్యాయం 1వ అధ్యాయము: అర్జున విషాద యోగం

Bhagavad Gita: Chapter 1

అర్జున విషాద యోగం

దాయాదులైన కౌరవులు, పాండవుల మధ్య మొదలవ్వబోతున్న గొప్ప మహాభారత సంగ్రామ యుద్ధభూమి యందు భగవద్గీత చెప్పబడింది. ఈ భారీ యుద్ధానికి దారి తీసిన పరిణామాల యొక్క వివరణాత్మక వర్ణన ఈ పుస్తకం యొక్క ఉపోద్ఘాతంలో, భగవద్గీత సమయ పరిస్థితి అనే భాగంలో చెప్పబడింది.ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరింపబడటం మొదలౌతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణం చేత, తానే స్వయంగా యుద్ధభూమి యందు లేడు, అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలని యథాతథంగా చెప్తున్నాడు. సంజయుడు, మహాభారతాన్ని రచించిన మహాత్ముడైన వేద వ్యాసుని శిష్యుడు. వేద వ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలని చూసే దివ్యశక్తి వుంది. అదే శక్తిని సంజయుడికి, యుద్ధభూమిలో జరిగే విశేషాలని ధృతరాష్ట్రునికి వివరించటానికి, ఆయన ప్రసాదించాడు.

✨ ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకునేవి (Key Takeaways)

  • జీవితంలో ఎదురయ్యే విషాదం, నిరాశ కూడా కొన్నిసార్లు జ్ఞానానికి తొలిమెట్టు అవుతుంది.
  • ధర్మసంకటం (కర్తవ్యం మరియు బంధుప్రేమ మధ్య పోరాటం) అందరికీ ఎదురవుతుంది. దానిని ఎదుర్కొనే ధైర్యం కావాలి.
  • సమస్య వచ్చినప్పుడు దాని నుండి పారిపోకుండా, గురువును (కృష్ణుడిని) ఆశ్రయించి పరిష్కారం వెతకాలి.

📖 అధ్యాయము లోని శ్లోకాలు (Verses in this Chapter)

📜 మొత్తం శ్లోకాలు: 47✅ అందుబాటులో ఉన్నవి: 47

ఈ అధ్యాయంలోని శ్లోకాలను చదవడానికి మరియు వాటి ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకోవడానికి కుడివైపున ఉన్న నావిగేషన్ గ్రిడ్ నుండి శ్లోక సంఖ్యపై క్లిక్ చేయండి.

భగవద్గీత అధ్యాయం 1 దైవిక చిత్రం